
చిరువ్యాపారి ఆత్మహత్యాయత్నం
గ్రీన్‌పార్క్ రోడ్డులో
తాటిచెట్లపాలెం : నరసింహనగర్ రైతుబజార్ వద్ద 30 ఏళ్లుగా చిన్న బడ్డీలు ఏర్పాటు చేసుకుని చిరు వ్యాపారాలు సాగిస్తున్న సుమారు 50 కుటుంబాలను కూటమి ప్రభుత్వం రోడ్డున పడేసింది. దీంతో ఆందోళన చెందిన నరసింహనగర్ ప్రాంతానికి చెందిన సంతోష్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గాజు సీసాను పగులగొట్టి ఛాతీపై గట్టిగా కోసుకున్నాడు. ఫోర్త్ టౌన్ ట్రాఫిక్ ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు, బంధువులు అతడిని అడ్డుకొని వారించారు. ఇక్కడే పుట్టి పెరిగానని, ఈ ప్రాంతంలో కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న చికెన్ సెంటర్‌ను తొలగించి, జీవనోపాధిపై వేటువేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. చిరు వ్యాపారులకందరికీ కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని వాపోయాడు.

చిరువ్యాపారి ఆత్మహత్యాయత్నం

చిరువ్యాపారి ఆత్మహత్యాయత్నం