
సెల్లార్‌లో స్పెషల్ బార్!
సెల్లార్.. పార్కింగ్‌కు మాత్రమే వినియోగించాలి. లేదంటే.. ఆ భవనంపైనా, యజమానిపైనా చర్యలు తీసుకుంటామంటూ జీవీఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ ఈ హెచ్చరికలు మాత్రం సామాన్యులకు మాత్రమే. అధికారం చేతుల్లో ఉంటే.. సెల్లార్ కాస్తా.. స్పెషల్ బార్‌గా మారిపోయినా.. పట్టించుకోరు. దీనికి ఉదాహరణే ఈ ఫొటోలో కనిపిస్తున్న రెస్టారెంట్ అండ్ బార్. ఎంపీ అండదండలు.. అధికార పార్టీలో చోటా నేతగా హల్‌చల్ చేస్తే చాలు.. అనుమతులు లేకపోయినా.. బార్ పెట్టెయ్యొచ్చు. టీడీపీ ఎంపీ భరత్ అనుచరుడిగా చెప్పుకుంటున్న ఆళ్ల వాసు నేతృత్వంలో అనధికారికంగా నిర్వహిస్తున్న బార్ ఇది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా డాబాగార్డెన్స్‌లోని సెల్లార్‌లో అకస్మాత్తుగా ఈ బార్ వెలిసింది. నిబంధనలకు పూర్తి విరుద్ధంగా.. సెల్లార్‌లో నిర్వహిస్తుంటే.. జీవీఎంసీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అనుమతులు లేకుండా బార్ నిర్వహిస్తుంటే.. ఎకై ్సజ్ అధికారులేమైనా చర్యలు తీసుకుంటున్నారా అంటే.. ఏమో సార్.. మాకు కనబడదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడైనా ఒక వ్యక్తి మద్యం బాటిల్స్‌తో కనిపిస్తే వెంటనే పట్టుకొని నానా హడావుడి చేసే ఎకై ్సజ్ అధికారులు.. స్వాతి రెస్టారెంట్ అండ్ బార్ విషయంలో మాత్రం.. సైలెంట్ మోడ్‌లో ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.
– విశాఖసిటీ/ఫొటో సాక్షి ఫొటోగ్రాఫర్