గురుద్వారా కూడలి సమీపంలో తరలిస్తున్న టిఫిన్ బడ్డీ
ఉదయం 7 గంటల నుంచే..
సీతంపేట : జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ సిబ్బంది, పోలీసులు, సచివాలయ కార్యదర్శులు గురువారం ఉదయం 7 గంటలకే జేసీబీలు, లారీలతో ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి చందు స్వీట్స్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి హైవే వరకు ద్వారకానగర్, సీతంపేట మెయిన్‌రోడ్‌లో రహదారికి ఇరువైపులా రోడ్డుపై, ఫుట్‌పాత్‌పై ఉన్న బడ్డీలు, టిఫిన్ బళ్లు, టీ స్టాళ్లు, ఫ్రూట్‌స్టాళ్లు, పకోడీ బళ్లు, బిర్యానీ, కర్రీపాయింట్లను జేసీబీలతో తొలగించి లారీల్లో తరలించారు. బీవీకే కళాశాల ఎదురుగా ఉన్న బడ్డీలను జేసీబీతో ధ్వంసం చేయడంతో వ్యాపారులు గగ్గోలుపెట్టారు. బడ్డీల్లోని సరుకులు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సీతంపేట కూడలిలో దుర్గాగణపతి ఆలయం పరిసరాల్లో ఉన్న వ్యాపారాలను తొలగించారు. అక్కడ నుంచి గురుద్వారా కూడలి సమీపంలో వైన్‌షాపు ముందున్న బోర్డును తీసేశారు. అక్కడే ఉన్న టీ స్టాల్, టిఫిన్ స్టాళ్లలోని స్టీల్ కౌంటర్లు తరలించడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం హైవే నుంచి డైమండ్ పార్కు వరకు ఉన్న శంకరమఠం రోడ్‌లో బడ్డీలు, తోపుడు బళ్లు తొలగించారు. ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే రోడ్డుపాలు చేశారని చిరువ్యాపారులు మండిపడ్డారు.
ప్రజాప్రతినిధులు లేని సమయంలో..
ఎంపీ, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు లేని సమయం చూసి ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపులు చేపట్టారు. కార్పొరేటర్లు వారం రోజుల పాటు స్టడీటూర్‌కు రాజస్థాన్ వెళ్లారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు, ఎంపీ పార్లమెంట్ సమావేశాలకు వెళ్లారు. చిరు వ్యాపారులు తమ గోడు వెళ్లబోసుకోవడానికి ఒక్క ప్రజాప్రతినిధి అందుబాటులో లేని సమయంలో డ్రైవ్ చేపట్టారు. దీంతో ఏమి చేయాలో తెలియక వ్యాపారులు ఆవేదనకు గురయ్యారు.
చిరువ్యాపారుల రెక్కలు విరిచిన కూటమి సర్కార్ ప్రత్యామ్న
చిరువ్యాపారుల రెక్కలు విరిచిన కూటమి సర్కార్ ప్రత్యామ్న