
దివ్యాంగుడిని ఎలా బతకాలి
గత 19 ఏళ్లుగా సీతంపేట జంక్షన్‌లో పకోడి బండి వేస్తున్నాను. నేను దివ్యాంగుడిని, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పకోడి బండిపై వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. ముందస్తు నోటీసు, సమాచార ఇవ్వకుండా ఉన్నపళంగా లారీలో బండిని పట్టుకుపోయారు. నా కుటుంబాన్ని రోడ్డున పడేశారు. ఎలా బతకాలి.
– పతివాడ శ్రీరాములు, పకోడి బండి, సీతంపేట
రోడ్డున పడేశారు
సీతంపేట మెయిన్‌రోడ్‌లో మార్గదర్శి బిల్డింగ్ పక్క రోడ్‌లో టీ కొట్టు నడుపుతున్నాను. సుమారు 15 సంవత్సరాలుగా ఇక్కడే వ్యాపారం చేస్తున్నాను. మెయిన్‌రోడ్‌పై లేకపోయినా నా బండి తొలగించారు. ఉన్నపళంగా తొలగిస్తే మాలాంటి వాళ్లు ఎలా బతకాలి. మా కుటుంబాన్ని రోడ్డునపడేశారు. – ఎల్.మహేష్, టీ కొట్టు, సీతంపేట

దివ్యాంగుడిని ఎలా బతకాలి