
రేపు ముఖ్యమంత్రి విశాఖ రాక
మహారాణిపేట: ఒక రోజు పర్యటన నిమిత్తం ఈ నెల 17న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ రానున్నారు. ఆ రోజు ఉదయం 11.25 గంటలకు బీచ్ రోడ్డులో గల ఏయూ సాగరిక ఫంక్షన్ హాల్‌లో జరగనున్న ఉమన్ అండ్ చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభించే ‘స్వస్థ్ నారీ – సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 3 గంటలకు రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొంటారు. సాయంత్రం 5.20 గంటలకు తాడేపల్లి బయలుదేరి వెళతారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జేసీ కె.మయూర్ అశోక్, ఇతర జిల్లా అధికారులు పరిశీలించి పలు సూచనలు చేశారు.