
ఆరుగురు సీఐలకు స్థానచలనం
విశాఖ సిటీ: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. ఇందులో ఇద్దరిని విశాఖ రేంజ్‌కు సరెండర్ చేశారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంవీపీ లా అండ్ ఆర్డర్ సీఐ జె.మురళి, వెస్ట్ జోన్ క్రైమ్ సీఐ ఎన్.శ్రీనివాసరావును విశాఖ రేంజ్‌కు సరెండర్ చేశారు. వీరి స్థానంలో ఎంవీపీ లా అండ్ ఆర్డర్‌కు ద్వారకా ట్రాఫిక్ సీఐగా ఉన్న కె.ఎన్.ఎస్.వి.ప్రసాద్‌ను, వెస్ట్ జోన్ క్రైమ్‌కు సిటీ వీఆర్–2లో ఉన్న మీసాల చంద్రమౌళిని నియమించారు. అలాగే ద్వారకా ట్రాఫిక్‌కు పోలీస్ కంట్రోల్ రూమ్‌లో ఉన్న ఎన్.వి.ప్రభాకర్‌రావు, సిటీ వీఆర్–1లో ఉన్న బి.భాస్కరరావును పోలీస్ కంట్రోల్‌లో పోస్టింగ్ ఇచ్చారు. అలాగే ఎంవీపీ లా అండ్ ఆర్డర్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎం.సుభాకరరావును పద్మనాభం లా అండ్ ఆర్డర్‌కు బదిలీ చేశారు.