
కూటమి సిగపట్లు
పెత్తనం కోసం ఎమ్మెల్యే పంచకర్ల..
టీడీపీ ఇన్‌చార్జి గండి బాబ్జి పాట్లు
ఒకరిపై ఒకరు తమ తమ అధిష్టానానికి
ఫిర్యాదులు
మీడియా ముఖంగా బహిర్గతం చేసిన
గండి బాబ్జి
పెందుర్తిలో
పెందుర్తి: పెందుర్తి నియోజకవర్గంలో అధికార కూటమి నాయకులైన జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, టీడీపీ ఇన్‌చార్జి గండి బాబ్జి మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. ఇద్దరు నాయకులు బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు కలిసి హాజరవుతున్నప్పటికీ, లోపల మాత్రం వారి మధ్య విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గంలోని వివాదాస్పద పనుల విషయంలో ఇద్దరూ భిన్నమైన వైఖరి తీసుకుంటూ అధికారులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని సమాచారం. తమ చెప్పుచేతల్లో అధికార యంత్రాంగాన్ని పెట్టుకోవడానికి ఇద్దరూ తీవ్రంగా పోటీ పడుతున్నారు. పంచకర్ల రమేష్ బాబు తాను ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి సుప్రీం అని భావిస్తుండగా, గండి బాబ్జి ఎన్నికల్లో తన కృషికి ఫలితంగా విజయం దక్కిందని, ఎమ్మెల్యేతో సమానంగా గౌరవం కావాలని పట్టుబడుతున్నారు. రెండు నెలల క్రితం వీఎంఆర్‌డీఏ సమీక్షలో కూడా వారి మధ్య వివాదం తలెత్తినట్లు సమాచారం. తాజాగా, సబ్బవరంలో ఒక అభివృద్ధి పని విషయంలో ఇరువురి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. దీనిపై గండి బాబ్జి శనివారం మీడియా ముందు మాట్లాడుతూ, ‘పేదల భూములు లాక్కొని అభివృద్ధి చేస్తారా? నేను బాధితుల తరఫున మాట్లాడితే, మా పొత్తులో ఉన్నవారే మా అధిష్టానానికి నాపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పెందుర్తి నియోజకవర్గంలో కూటమి నాయకుల మధ్య సఖ్యత లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
తొలి నుంచీ తలోదారే
పెందుర్తిలో జరుగుతున్న ప్రతీ అంశంలోనూ ఎమ్మెల్యే పంచకర్లకు, గండి బాబ్జీకి మద్య సఖ్యత ఉండడం లేదన్నది బహిరంగ రహస్యమే. ఇటీవల కాలంలో వీరి మద్య మరింత దూరం పెరిగింది. పెందుర్తి పీఏసీఎస్ చైర్మన్‌గా పంచకర్ల సిఫార్సుతో జనసేన నాయకుడు అయిత సింహాచలంని (మిగతా 8లో)
‘నేను పెందుర్తి ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేని. నా మీద టీడీపీ ఇన్‌చార్జిని వేసి అతనికీ అధికారాలు ఇస్తామంటే ఎలా. ప్రతీ అధికారిక సమావేశానికి ఇన్‌చార్జిలు వచ్చి పెత్తనం చేయడం ఏంటి. నియోజకవర్గంలో కూడా మాకు తెలియకుండా టీడీపీ నేతలు పనులు చేయించుకుంటున్నారు. పార్టీ ఇన్‌చార్జిలు అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం ఏంటి. ఇదేనా కూటమి పొత్తు ధర్మం’ రెండు నెలల క్రితం వీఎంఆర్‌డీఏ వేదికగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు చేసిన వ్యాఖ్యల సారంశం.