
విశాఖ మార్కెట్‌లోకి కొత్త కేటీఎం డ్యూక్ 160 బైక్
ఏయూ క్యాంపస్: కేటీఎం డ్యూక్ 160 బైక్ విశాఖ మార్కెట్‌లోకి విడుదలైంది. బీచ్‌రోడ్డులోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ బైక్‌ను నగర ప్రజలకు పరిచయం చేశారు. వరుణ్ సంస్థల చైర్మన్ ప్రభు కిశోర్, సౌత్ సేల్స్ సర్కిల్ హెడ్ కార్తీక్ కలిసి ఈ కొత్త బైక్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభు కిశోర్ మాట్లాడుతూ ఫ్యాషన్, పర్ఫార్మెన్స్, పవర్ ఈ మూడింటి కలయికగా ఈ బైక్ నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కేటీఎం గ్లోబల్ బ్రాండ్ డిస్‌ప్లే, లైవ్ రాక్ బ్యాండ్ ప్రదర్శనతో పాటు అవార్డుల ప్రదానోత్సవం కూడా జరిగింది