
రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల ప్రారంభం
పీఎంపాలెం: ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం శిల్పారామంలోని యోగా హాలులో రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ పోటీలను ప్రారంభించారు. ప్రాచీన యుద్ధకళలు వ్యక్తిగత ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, ఎన్టీఆర్, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అన్నమ య్య, అనంతపురం జిల్లాలకు చెందిన సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఆనంద్ తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ పో టీల్లో రాష్ట్ర అమెచ్యూర్ తైక్వాండో అసోసియేషన్ కా ర్యదర్శి గ్రాండ్ మాస్టర్ బాబూరావు, పీఎంపాలెం వాకర్స్ క్లబ్ 20–20 అసోసియేషన్ అధ్యక్షుడు బాబ్జీ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
గెస్ట్ రిలేషన్ అసోసియేట్‌గా ఉచిత శిక్షణ