
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే వేధిస్తారా?
ప్రాథమిక హక్కుల్లో ఒకటైన భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేసేందుకు కూటమి ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో గవర్నర్, కేంద్ర హోంమంత్రి జోక్యం చేసుకుని పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని సందర్భంలో, ప్రజా సమస్యలను పట్టించుకోనప్పుడు.. ప్రజా గొంతుకగా మీడియా తన వాణిని వినిపిస్తుంది. దీనిని ప్రభుత్వాలు తమ లోపాలను సరిదిద్దుకునేందుకు ఒక మంచి అవకాశంగా భావించాలే తప్ప, మీడియా, జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేయకూడదు. ఒకవేళ అదే చేస్తే, ఆ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నట్లే. చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. రైతు నుంచి యువత వరకూ అందరికీ అమలు చేయలేని హామీలు ఇచ్చి, ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న సాక్షిపై అక్రమ కేసులు పెట్టడం, సాక్షి ఎడిటర్‌ను వేధించడం సరికాదు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న చానళ్లు, పత్రికలపై వేధింపులు మానుకోవాలి. – వాసుపల్లి గణేష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే, విశాఖ దక్షిణ నియోజకవర్గం