
ఏయూలో ఉగ్రదాడి!
ఏయూలో జరిగిన రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న ఆక్టోపస్ కమాండోలు, పోలీసులు
బీచ్‌రోడ్డు: ప్రశాంతమైన ఆంధ్ర విశ్వవిద్యాలయంలోకి ఒక్కసారిగా పోలీస్ వాహనాలు దూసుకొచ్చాయి. మరోవైపు తుపాకీలతో ఆక్టోపస్ కమాండోలు సైతం చేరుకున్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లు పరుగులు పెట్టాయి. ఈ సన్నివేశాలను చూస్తున్న ప్రజలకు అసలు ఏయూలో ఏం జరుగుతుందో అర్థం కాక ఆసక్తిగా తిలకించారు. తీరా ఇదంతా విపత్కర పరిస్థితుల్లో చేపట్టే ముందుస్తు మాక్ డ్రిల్ అని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీలోని భారతీయ పెట్రోలియం, శక్తి సంస్థలో శనివారం నగర పోలీస్ శాఖ, ఆక్టోపస్ సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రదాడి జరిగినప్పుడు ఏ విధంగా రక్షణ చర్యలు తీసుకోవాలనే దానిపై నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, ఆక్టోపస్ డీఎస్పీ శ్రీనివాస ఆధ్వర్యంలో జరిగిన ఈ మాక్ డ్రిల్ అందరినీ అబ్బుర పరిచింది.

ఏయూలో ఉగ్రదాడి!