
రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు ముప్పు
భారత రాజ్యాంగం పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛా హక్కులను కల్పించింది. అయితే కూటమి ప్రభుత్వం ఈ హక్కులను అణచివేసే కుట్రలు చేస్తోంది. ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకులైనా మీడియా సమావేశాలు నిర్వహించి అనేక అంశాల గురించి మాట్లాడతారు. వాటిని ప్రజలకు వార్తల రూపంలో చేరవేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తారు. అంతమాత్రాన జర్నలిస్టులపై, వార్తలను ప్రచురించిన పత్రికలపై కేసులు నమోదు చేయడం సబబు కాదు. ఈ విషయంలో సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై కేసులు నమోదు చేసి వేధించడం సరికాదు. సీఎం చంద్రబాబుకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజలు తనను గద్దె దింపుతారనే అభద్రతా భావంతోనే ఇప్పటివరకు సోషల్ మీడియా కార్యకర్తలపై, ఇప్పుడు సాక్షి మీడియాపై కేసులు పెడుతున్నారు. చంద్రబాబు చర్యలకు కాలమే సరైన సమాధానం చెబుతుంది. –కె.కె.రాజు, వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు

రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు ముప్పు