
నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా పిల్లల దత్తత
మహారాణిపేట : కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం పిల్లల దత్తత ప్రక్రియను నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పాన్ కార్డు, ఆదాయ, వయస్సు, నివాస, వివాహ, ఆరోగ్యఽ ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత పోస్టరును సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌లో ఆయన ఆవిష్కరించారు. దత్తత తీసుకోవాలనుకునే వారు అదనపు సమాచారం కోసం దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని, ఐసీడీఎస్ పీడీ, ఇతర అధికారులను, జిల్లా బాలల పరిరక్షణ అధికారిని సంప్రదించవచ్చన్నారు. ఠీఠీఠీ.ఛ్చిట్చ.ఠీఛిఛీ.జౌఠి.జీ ుఽ వెబ్‌సైట్‌లోను వివరాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జేసీ కె.మయూర్ అశోక్, డీఆర్వో భవానీ శంకర్, ఐసీడీఎస్ పీడీ రామలక్ష్మి పాల్గొన్నారు.