
మొత్తం 241.92 ఎకరాలు
విశాఖలో టూరిజం ప్రాజెక్టుల పేరుతో కన్నేసిన మొత్తం భూమి 176.15 ఎకరాలు
అల్లూరి జిల్లాలో
43.10 ఎకరాలు
అనకాపల్లి జిల్లాలో
22.67 ఎకరాలు
64 ప్రాజెక్టులు
రూ.8806 కోట్లు..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ‘రిక్రియేషన్ టూరిజం’కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జీఐఎస్–2023లో సింగపూర్, టర్కీ, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి వచ్చిన సంస్థలతో రూ.8,806 కోట్ల విలువైన 64 పర్యాటక ప్రాజెక్టులకు ఎంవోయూలు కుదిరాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో 18,205 మందికి ప్రత్యక్షంగా, మరో 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలిగేవి. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఈ సంస్థలు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చుట్టూ తిరిగినా ఎలాంటి స్పందనా రాలేదు. భూమి కేటాయిస్తే వెంటనే పనులు ప్రారంభిస్తామని కోరినా, భూ కేటాయింపులు ఇప్పట్లో ఉండవంటూ అధికారులు వారిని వెనక్కి పంపించారు. దీనివల్ల పర్యాటక ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.