
కౌంటీ సీసీ కెప్టెన్ హరీష్ వీరవిహారం
విశాఖ స్పోర్ట్స్: వీడీసీఏ ఒకటో డివిజన్ క్రికెట్ లీగ్‌లో కౌంటీ సీసీ కెప్టెన్ హరీష్‌కుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగి అజేయ డబుల్ సెంచరీతో (202) కదంతొక్కాడు. పీఎంపాలెంలోని వైఎస్సార్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ సీసీ జట్టుపై 307 పరుగుల భారీ తేడాతో కౌంటీ సీసీ విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కౌంటీ సీసీ నిర్ణీత 40 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 367 పరుగులు చేసింది. ఓపెనర్ దేవాశిష్ 75 పరుగులు చేయగా చరణ్ 61 పరుగులతో రాణించాడు.కెప్టెన్ హరీష్ 15 ఫోర్లు, 12 సిక్సర్లతో చెలరేగాడు. నవవసంత్ రెండు వికెట్లను తీశాడు. ప్రతిగా రాయల్ సీసీ 21.5 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 60 పరుగులే చేసింది. శివ మూడు, ఆదిత్య రెండు వికెట్లు తీశారు.