
చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి
తగరపువలస: ఆనందపురం మండలం గంభీరం రిజర్వాయర్‌లో ఆదివారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన సమీర్(26) నీటిలో మునిగి చనిపోయాడు. మారికవలసకు చెందిన సమీర్‌కు ఈత రాదు. అయితే ఐదుగురు వ్యక్తులతో కలిసి రిజర్వాయర్‌లో దిగిన సమీర్ ఈ ప్రమాదానికి గురయ్యాడు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందంతో పాటు తాళ్లవలస అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమీర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన తండ్రి ఫిర్యాదు మేరకు ఆనందపురం సీఐ వాసునాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది కేసు దర్యాప్తు చేస్తున్నారు.