
పార్టీ కోసం కష్టపడేవారికే కమిటీల్లో చోటు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ బలోపేతానికి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ మండల, వార్డు కమిటీల్లో అవకాశం కల్పిస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. సోమవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో మండల, వార్డు కమిటీలపై పార్టీ సీనియర్ నాయకులు, వార్డు అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. వార్డుల వారీగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే యువతకు అవకాశం కల్పించేలా వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. విశాఖ ఉత్తర, దక్షిణ, విశాఖ పశ్చిమ, విశాఖ తూర్పు, గాజువాక నియోజకవర్గాల నుంచి పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. నియోజకవర్గాల్లోని వార్డుల వారీగా ప్రతి ఒక్కరితో మాట్లాడి, పార్టీ కోసం పనిచేసి కూడా ఇప్పటివరకు పదవులు రాని కార్యకర్తల పేర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పార్టీ కమిటీల నిర్మాణంపై చర్చించారు. కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవిరెడ్డి, కార్పొరేటర్లు, పార్టీ నేతలు స్వాతి దాస్, పేడాడ రమణికుమారి, పీలా వెంకటలక్ష్మీ, సీహెచ్ లావణ్య, నీలి రవి, బి. పద్మావతి, మంచ నాగ మల్లేశ్వరి, జీలకర్ర నాగేంద్ర, గుండుపల్లి సతీష్, భీశెట్టి ప్రసాద్, చొక్కర శేఖర్, వరలక్ష్మీ, రాఘవులు, అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.