
రేపు జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
సీతంపేట: ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం ఆంధ్రా యూనివర్సిటీ ప్లాటినం జూబ్లీ హాల్–2 లో జరుగుతుందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు. అక్కయ్యపాలెంలోని ఒక హోటల్లో మంగళవారం జరిగిన ఫెడరేషన్ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం జరగనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అన్ని జిల్లాల నుంచి 70 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్టు తెలిపారు. సమావేశంలో ఐదు తీర్మానాలు ప్రవేశపెట్టి రాష్ట్ర కార్యవర్గ ఆమోదం తీసుకుంటామన్నారు. జిల్లా అధ్యక్షుడు పి.నారాయణ్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ల మంజూరు, ప్రమాద బీమా పునరుద్ధరణ, పెన్షన్ విధానం వంటి పలు అంశాలపై చర్చిస్తామని తెలిపారు.