
మేలు రకం అయితేనే ఆసక్తి చూపుతున్నారు
మేం మూడు ఎకరాల్లో కొన్ని ముఖ్యమైన మామిడి రకాలు వేశాం. నాలుగేళ్ల నుంచి పంట వస్తుంది. పోయిన ఏడాది చాలా నష్టపోయాం. కానీ ఈ ఏడాది దిగుబడి మెరుగుపడింది. అయితే బంగినపల్లి, సువర్ణరేఖ, రసాలే ప్రజలు ఎక్కువ అడుగుతున్నారు. వారికి కావాల్సిన రకాలు సమకూర్చి అందిస్తున్నాం. ఈ ఏడాది భారీగా లాభాలు వచ్చే అవకాశం లేదు.
– చప్పా సన్యాసమ్మ, అడ్డూరు, చొడవరం మండలం
ధరలు అందుబాటులో ఉన్నాయి
సీజన్ ఊపందుకోవడంతో అన్ని రకాల మామిడి పండ్లు దొరుకుతున్నాయి. ఇప్పటివరకు రైతు బజార్‌లో ఐదారు సార్లు కొనుగోలు చేశాను. మా బంధువులు, మిత్రులకు కూడా ఇక్కడే తీసుకోమని సూచిస్తున్నారు. బయటి మార్కెట్‌తో పోల్చితే రైతుబజార్‌లో రూ.20 వరకు తక్కువగానే వస్తున్నాయి. ఏ రకం పళ్లు అయినా సగటున రూ.40–45కి అందిస్తున్నారు. గతేడాదితో పోల్చితే ఇది చాలా మెరుగైన ధర. – శాస్త్రి, పెందుర్తి, వినియోగదారుడు

మేలు రకం అయితేనే ఆసక్తి చూపుతున్నారు