
దిగుబడి ఉన్నా ధరలు లేవు
మాకు మూడు ఎకరాల మామిడి తోట ఉంది. అందులో బంగినపల్లి, సువర్ణరేఖ జాతులు అధికంగా ఉన్నాయి. మొదట్లో పూత చాలా బాగా వచ్చింది. అయితే పొగమంచు అధికంగా పడడంతో పాటు వర్షాలు కూడా మమ్మల్ని దెబ్బకొట్టాయి. అయినా గతేడాదితో పోల్చితే దిగుబడి బాగానే వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో ధరలు లేవు. వచ్చినంతలో రైతుబజార్‌కు వచ్చి అమ్ముకుంటున్నాం. మాకు లాభం లేకపోయినా ప్రజలైనా మంచి మామిడి పండ్లు తినాలనే ఉద్దేశంతో ఒక్కోసారి నిర్ణయించిన ధర కంటే తక్కువకే ఇచ్చేస్తున్నాం.
– గొర్లి అప్పలనాయుడు, ఆర్లి, కె.కోటపాడు
కష్టానికి తగ్గ ధర వస్తే చాలు
మా దగ్గర నాలుగు ఎకరాల తోట ఉంది. దాంతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. ఈ ఏడాది మొదట్లో వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడి ఆశించినంతగా లేదు. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి బాగానే పండింది. మా తోటలో సగానికి పైగా దించేశాం. పంట నిలబెట్టుకోవడానికి చాలా ఖర్చు పెట్టాం. సీజన్ పూర్తయ్యేసరికి కనీసం నష్టం రాకుండా ఉంటే చాలని అమ్మకాలు చేస్తున్నాం. –నాగిరెడ్డి అప్పలనాయుడు, కె.కోటపాడు

దిగుబడి ఉన్నా ధరలు లేవు