
సైనిక్ స్కూల్‌కు తగరపువలస విద్యార్థి ఎంపిక
తగరపువలస: కోరుకొండ సైనిక్ స్కూల్‌లో 9వ తరగతిలో ప్రవేశానికి ఇటీవల జరిగిన ప్రవేశ పరీక్షలో జోగావారి వీధికి చెందిన తెడ్లాపు దినేష్ ఎంపికయ్యాడు. ఈ పరీక్షలో 400 మార్కులకు గాను దినేష్ 370 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 108వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం భీమిలి ఐఎన్‌ఎస్ కళింగలో దినేష్ 8వ తరగతి పూర్తి చేశాడు. తల్లిదండ్రులు నరేంద్రకుమార్, లక్ష్మీదేవి మాట్లాడుతూ చైన్నెలోని నేషనల్ డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ఆన్‌లైన్‌లో దినేష్‌కు కోచింగ్ ఇప్పించినట్టు తెలిపారు.