
● ఏనుగమ్మా.. ఏనుగు
పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకర్షించే ఏనుగు ఊరేగింపుగా వెళ్తోంది. అయితే ఇది నిజమైన ఏనుగు కాదు.! కళాకారుల నైపుణ్యానికి అద్దం పట్టేలా వెదురుతో చేసిన ఏనుగు! నగరంలోని ఓ గ్రామ దేవత పండగ కోసం సిద్ధం చేసిన ఈ వెదురు ఏనుగును ‘ఏనుగమ్మా.. ఏనుగు..’ అంటూ ఆదివారం పండగ కమిటీ సభ్యులు తీసుకువెళ్లారు. ఈ దృశ్యం చూపరుల మనసు దోచుకుంది. వెదురు బద్దలు ఉపయోగించి.. ఎంతో ఓర్పుతో.. కళాత్మక దృష్టితో ఈ ఏనుగు నమూనాను రూపొందించడం విశేషం. ఇదికళాకారుల సృజనాత్మకతకు, వారి అంకిత భావానికి నిదర్శనం.
–ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం