
ఉగ్రవాదులను నిర్మూలించాలి
ఏయూక్యాంపస్ : భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల జన జాగరణ సమితి సంతోషం వ్యక్తంచేసింది. బుధవారం ఉదయం బీచ్‌రోడ్డులోని విక్టరీ ఎట్ సీ వద్ద జాతీయ పతాకాలు పట్టుకుని తీవ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సమితి నగర కన్వీనర్ చింతపల్లి సునీల్ కుమార్ మాట్లాడుతూ పెహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్‌లో ఉగ్రవాద శిబిరాలను పూర్తిస్థాయిలో నాశనం చేయడంలో భారత్ సఫలీకృతం అయిందన్నారు. భారతీయులంతా కుల, మతాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి, భారత రక్షణదళాలకు సంపూర్ణ మద్దతు అందించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జన జాగరణ సమితి నాయకులు వాసు, దామోదర్ గుప్తా, తనూజ్, మునివర్ధన్, జనార్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.