ఘనంగా గురునానక్ జయంతి
సీతమ్మధార: సిక్కుల మొదటి గురువు గురునానక్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. గురుద్వారా సత్సంగ్ మందిరంలో అధ్యక్షుడు డి.ఎస్.ఆనంద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం నగర్ కీర్తన్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు ఉత్తర ఎమ్మెల్యే కుమార్తె శ్యామల దీపిక జెండా ఊపి నగర్ కీర్తన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ర్యాలీ సీతంపేట, ఆర్టీసీ కాంప్లెక్స్, పాత జైలురోడ్డు, సెవన్ హిల్స్ ఆస్పత్రి, సిరిపురం, ఆర్.కె.బీచ్, పామ్ బీచ్, కాళీమాత గుడి నుంచి రామాటాకీస్, సత్యం జంక్షన్ల మీదుగా తిరిగి రాత్రి 7 గంటలకు గురుద్వారా వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా సిక్కు జెండాలతో అలంకరించిన నిషాన్ సాహిబ్ వాహనం ర్యాలీలో పాల్గొంది. పెద్ద సంఖ్యలో సిక్కులు హాజరై సందడి చేశారు.
ఘనంగా గురునానక్ జయంతి
ఘనంగా గురునానక్ జయంతి


