ఎంవీపీకాలనీ: ఫిషింగ్ హార్బర్‌లో జరిగి ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని, బాధితులను ఆదుకోవాలని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కేంద్ర ప్రభుత్వానికి లేఖరాశారు. ప్రమాదంలో 44 లైసెన్స్‌డ్ బోట్లు దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ బాధితులకు భారీ సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. 80 శాతం పరిహారం అందిస్తా మని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా బాధితులను ఆదుకోవాలని ఎంపీ కోరారు. ఈ మేరకు కేంద్ర మత్స్య, పశువర్ధక, పాడిపరిశ్రమల శాఖ మంత్రికి లేఖ రాసినట్లు తెలిపారు.