దోమ: మేడపై నిద్రిస్తున్న వ్యక్తి ప్రమాదవాశాత్తు కింద పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఎస్ఐ వసంత్జాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఐనాపూర్ గ్రామానికి చెందిన గొల్ల కృష్ణయ్య(32) కొడంగల్ మండలం గుట్లకుంట గ్రామంలో ఉంటున్నాడు. ఈ నెల 4న భార్య కాశమ్మతో కలసి మండలంలోని కొత్తపల్లిలో జరిగిన ఓ వేడుకకు హాజరయ్యాడు. రాత్రి అక్కడే నిద్రించిన అతను.. మేడ పైనుంచి కింద పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని మహబూబ్నగర్లోని ఓ ఆసుపత్రికి, అక్కడి నుంచి నగరానికి తరలించారు. హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. సోమవారం భార్య కాశమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


