నిర్లక్ష్యమంట! | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యమంట!

Oct 5 2026 8:30 AM | Updated on Oct 5 2026 8:30 AM

సోమవారం శ్రీ 5 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 నీటి కుంట.. నిర్లక్ష్యమంట! 8లోu

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 5 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
నీటి కుంట..

తాండూరు: రైతుల భూముల్లో నీటి కుంటలు నిర్మించి భూగర్భ జలాలు పెంచేందుకు ఫామ్‌ పాండ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో పనులు మాత్రం జరగడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్షపు నీటిని కాపాడుకునేందుకు అధికారులు ఉ న్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా అ డుగులు వేస్తున్నారు. పొలాల్లో ఇంకుడు గుంతలు, నీటి కుంటలు ఏర్పాటు చేసేందుకు ఉపాధి హామీ పథకం, విలేజ్‌ ఆర్గనైజేషన్‌ కమిటీలకు బాధ్యతలు అప్పగించారు. ఇటీవల కాలంలో అధికారులు సుడిగాలి పర్యటనలు చేస్తూ రైతులు, ప్రజ లను అప్రమత్తం చేస్తున్నారు. అయినా పనులు వేగం పుంజుకోవడం లేదు. నత్తతో పోటీ పడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో వేల సంఖ్యలో ఫామ్‌పాండ్స్‌ నిర్మించారు. అయితే వాటిని రైతులు పూడ్చివేసి పంట సాగు చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఆశించిన స్థాయిలో లేని పనులు

జిల్లాలోని 594 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం, విలేజ్‌ ఆర్గనైజేషన్ల ద్వారా 2,176 ఫామ్‌ పాండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉపాధి పథకం కింద 1,782, విలేజ్‌ ఆర్గనైజేషన్‌ ద్వారా 392 నిర్మించాలని నిర్ణయించారు. ఉపాధి పథకం కింద 750 పనులు గ్రౌండింగ్‌ కాగా 123 నిర్మాణాలు పూర్తయ్యాయి. విలేజ్‌ ఆర్గనైజేషన్ల కింద 206 పనులు ప్రారంభం కాగా 58 పూర్తయ్యాయి.

బంట్వారంలో ముందంజ

ఫామ్‌పాండ్ల నిర్మాణంలో బంట్వారం మండలం జిల్లాలోనే ముందంజలో నిలిచింది. దుద్యాల మండలం అట్టడుగు స్థానంలో ఉంది. గ్రామ పంచాయతీల వారీగా లక్ష్యాలను(శాతం) పరిశీలిస్తే బంట్వారంలో 86శాతం, మర్పల్లిలో 74శాతం, కుల్క చర్లలో67 శాతం, మోమిన్‌పేట్‌లో 64శాతం, నవాబ్‌పేటలో 63శాతం, చౌడాపూర్‌లో 61శాతం పురోగతి సాధించాయి. దుద్యాలలో కేవలం 10శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. తాండూరు, బొంరాస్‌పేట్‌, బషీరాబాద్‌ మండలాలు ఫామ్‌పాండ్ల నిర్మాణాల్లో వెనుకబడ్డాయి.

భూగర్భజలాల పెంపే లక్ష్యంగా అనేక పథకాలు జీవం పోసుకున్నాయి. వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు లక్షలాది రూపాయలు వెచ్చించి చెక్‌డ్యాంలు, ఇంకుడు గుంతలు, చెరువుల్లో పూడిక తీయడం, పొలాల్లో నీటి కుంటల వంటి నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వ సంకల్పం బాగానే ఉన్నా క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు.

జిల్లాకు మంజూరైన ఫామ్‌ పాండ్స్‌ 2,176

ఇప్పటి వరకు పూర్తయినవి 181

అసంపూర్తిగా ఉన్నవి 956

పనులు ప్రారంభం కానివి 1,039

పట్టించుకోని అధికారులు

గత ప్రభుత్వ హయాంలో..

గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో వేల నీటి కుంట నిర్మాణం జరిగింది. అప్పట్లో 18,600 మంజూరు కాగా 8,500 నిర్మాణాలను పూర్తి చేశారు. కొన్నేళ్ల పాటు మంచి ఫలితాలు వచ్చాయి. రెండేళ్ల క్రితం వరకు భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. ఆ తర్వాత వాతావరణం అనుకూలించకపోవడంతో నీటి కుంటల వల్ల ప్రయోజనం తగ్గింది. దీంతో రైతులు సగానికి పైగా పూడ్చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement