రోడ్డు విస్తరణ ఎప్పటికో? | - | Sakshi
Sakshi News home page

రోడ్డు విస్తరణ ఎప్పటికో?

Oct 5 2026 8:30 AM | Updated on Oct 5 2026 8:30 AM

ధారూరు: తాండూరు – వికారాబాద్‌ వయా ధారూరు, కేరెళ్లి మీదుగా అనంతగిరి గుట్ట రోడ్డు విస్తరణకు నోచుకోవడం లేదు. తరచూ ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్న అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలువురు మండిపడుతున్నారు. రోడ్డును విస్తరించాలంటూ పలుమారు ఆర్‌అండ్‌బీ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదు. అటవీ శాఖ అధికారులు రోడ్డు విస్తరణను అడ్డుకుంటున్న తెలిసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని రోడ్డు వేయాలని వారు సూచిస్తున్నట్లు సమాచారం. ఆర్‌అండ్‌బీ అధికారులు ఆ దిశగా ఏలాంటి ప్ర యత్నాలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. మలుపులతో కూడుకున్న ఈ రోడ్డులో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ధారూరు మండలం కేరెళ్లి –అనంతగిరి మార్గంలో ఓ ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడి నలుగురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. గుట్ట పైనుంచి కిందికి వస్తున్న క్రమంలో చివరి రోడ్డు మలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది. బైక్‌లు, కార్లు, లారీలతో పాటు ఆర్టీసీ బస్సులు సైతం ప్రమాదానికి గురైన సంఘటనలు అనేకం. ఈ గుట్ట అడవీ ప్రాంతంలో ఉండటంతో రోడ్డు విస్తరణకు ఫారెస్టు అధికారులు ససేమిరా అంటున్నారు. ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోతున్నా రాజకీయ పార్టీ నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. కొంత కాలంగా ఈ గుట్ట పరిసరాల్లో జరిగిన ప్రమాదాల్లో దాదాపు 13 మంది వరకు మృతి చెందారని వాహనదారులు అంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డును వెడల్పు చేయడంతో పాటు మలుపులు ఉన్న ప్రతి చోట రెండు వైపులా తక్కువ ఎత్తులో స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.

తరచూ ప్రమాదాలు

గాల్లో కలుస్తున్న ప్రాణాలు

పట్టించుకోని అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement