డీఎంహెచ్‌ఓ సుధాకర్ లాల్
కుల్కచర్ల: విద్యార్థుల వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని కేజీబీవీలో విద్యార్థినులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్లులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుపై దృష్టి సారిస్థారని తెలిపారు. అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి కిరణ్‌కుమార్ గౌడ్, అప్తామాలిక్ అసిస్టెంట్ జవహర్, కేజీబీవీ ప్రత్యేకాధికారి దేవి, చౌడాపూర్ కేజీబీవీ ప్రత్యేకాధికారి జ్యోతి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


