594 బస్తాల పీడీఎస్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

594 బస్తాల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

Sep 16 2026 8:52 AM | Updated on Sep 16 2026 8:52 AM

మూడు వాహనాల సీజ్‌

ఆరుగురిపై కేసు నమోదు

దౌల్తాబాద్‌: టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడుల్లో భారీగా పీడీఎస్‌ బియ్యం బస్తాలు పట్టుబడ్డాయి. ఈ ఘటన మంగళవారం మండలంలోని అంతారం గ్రామంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశ్వసనీయ సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గ్రామంలో సోదాలు నిర్వహించారు. ఓ గోదాంలో బియ్యం ఉన్నట్లు తెలుసుకుని అక్కడి వెళ్లి సోదాలు చేపట్టారు. కర్ణాటకకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న 594 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ డీసీఎంలో 480 బియ్యం బస్తాలు, బులెరోలో 80 బస్తాలు, మరో వాహనంలో 34 బస్తాల బియ్యం బస్తాలను పట్టుకున్నారు. వాటని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్లు నవీన్‌, పరుశురాం, డ్రైవర్‌ కం ఓనర్‌ మల్లేశం, యజమానులు శ్యామప్ప, జానయ్యతో పాటు సూత్రధారి వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వేణుకుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement