● ఆకుతోటపల్లి యువకుల అభ్యర్థన
● అడిషనల్ కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం
ఆమనగల్లు: ఆకుతోటపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 304లో అనుమతి ఇచ్చిన క్వారీ, క్రషర్ యూనిట్‌ను రద్దు చేయాలని స్థానిక యువకులు డిమాండ్ కోరారు. ఈ మేరకు మంగళవారం అదనపు కలెక్టర్ కిరణ్మయిని కలిసి వినతిపత్రం అందించారు. గ్రామ పంచాయతీ ఎన్‌ఓసీ లేకుండా క్రషర్ యూనిట్‌కు అధికారులు అనుమతులు జారీచేశారని వినతిపత్రంలో పేర్కొన్నారు. జీపీ తీర్మానం, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఇచ్చిన క్వారీ అనుమతులను వెంటనే రద్దు చేయాలని కోరారు. క్రషర్ ఏర్పాటుతో సమీప పొలాల రైతులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతారని పేర్కొన్నారు. ఈ విషయమై పూర్తి విచారణ జరిపి, న్యాయం చేయాలని కోరారు.


