● గ్రామసభల్లో రైతుల డిమాండ్
● కలెక్టర్‌కు విన్నవిస్తామన్న ఆర్‌డీఓ అనిత
బొంరాస్‌పేట: మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకానికి భూములిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అయితే పరిహారం డబ్బు పెంచాలని ఆయా గ్రామాల రైతులు కోరారు. మంగళవారం దుద్యాల మండలం హస్నాబాద్, దుద్యాలలో వేర్వేరుగా గ్రామసభలు నిర్వహించారు. తాండూరు ఆర్‌డీఓ అనిత హాజరై రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. హస్నాబాద్, ఆలీడు గ్రామాల్లో 145 మంది రైతులకు చెందిన 84.35 ఎకరాలు సేకరించనున్నట్లు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు తెలిపారు. దుద్యాల, అల్లిఖాన్‌పల్లి గ్రామాల్లో 125మంది రైతులకు చెందిన 65 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. గుంట భూమికి కనీసం రూ.75 వేల చొప్పున ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టి తీసుకెళ్తామని ఆర్‌డీఓ హామీ ఇచ్చారు. దుద్యాల గ్రామసభకు బీఆర్‌ఎస్ నాయకులకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిషన్‌నాయక్, ఇరిగేషన్ డీఈ కృష్ణమోహన్‌గౌడ్, డీటీ శివకుమార్, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.


