లారీ, బైక్‌ ఢీ.. | - | Sakshi
Sakshi News home page

లారీ, బైక్‌ ఢీ..

Jul 19 2026 6:47 AM | Updated on Jul 19 2026 6:47 AM

లారీ, బైక్‌ ఢీ.. బీఆర్‌ఎస్‌ నాయకుల హౌస్‌ అరెస్ట్‌ పొలం గట్టు వివాదం విద్యారంగ సమస్యలపై ‘ఛత్రోన్‌ కి గూంజ్‌’ విద్యుదాఘాతంతో ఎద్దు మృతి

ఇద్దరికి గాయాలు

కుల్కచర్ల: బైక్‌, లారీ ఢీకొని ఇద్దరు గాయపడ్డా రు. ఈ సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. శనివారం ఉదయం సాల్వీడు గ్రామానికి చెందిన రాములు, కనకమ్మ, వెంకటమ్మలు కుల్కచర్లకు వెళ్తున్న క్రమంలో ఘణపూర్‌ గేటు సమీపాన మహబూబ్‌నగర్‌ నుంచి వస్తున్న లారీ వీరి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయడపడ్డారు. బాధితులు 108కి ఫోన్‌ చేయగా.. వాహన సిబ్బంది వినోద్‌, నర్సింలు.. కనకమ్మను మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వెంకటమ్మను స్థానికంగా చికిత్స అందించారు. క్షతగాత్రుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.

తాండూరు: తాండూరు పట్టణ బీఆర్‌ఎస్‌ నాయకులు, మున్సిపల్‌ కౌన్సిలర్లను శనివారం పట్టణ పోలీసులు గృహనిర్బంధం చేశారు. శనివారం మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పర్యటనను అడ్డుకొంటామని ప్రకటించడంతో.. పార్టీ మున్సిపల్‌ కౌన్సిల్‌ ఫ్లోర్‌లీడర్‌ పట్లోళ్ల దీపనర్సింహులు, కౌన్సిలర్లను హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

తమ్ముడిపై అన్న దాడి

పోలీస్‌ స్టేషన్‌లో బాధితుడి ఫిర్యాదు

నవాబుపేట: పొలం గట్టు వివాదంలో తమ్ముడిపై అన్న దాడి చేశాడు. ఈ ఘటన మండలంలోని ముబారక్‌పూర్‌ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అంతమొళ్ల దయాకర్‌ రెడ్డి, అంతమొళ్ల ప్రభాకర్‌రెడ్డి అన్నదమ్ములు. సోదరుడు దయాకర్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. తమ్ముడి పొలం గట్టును అన్న దయాకర్‌ చదును చేసి పంట వేశాడు. ఈ విషయాన్ని తమ్ముడు స్థానికులకు చూపించాడు. గ్రామస్తుల ముందు తనను నిలదీస్తావా అంటూ దయాకర్‌ రెడ్డి తమ్ముడు ప్రభాకర్‌రెడ్డి తోపాటు సమీప బంధువు గోపాల్‌ రెడ్డిపై దాడి చేశాడు. నేను లీడర్‌ను నాతో పెట్టుకుంటే చంపేస్తానని బెదిరిస్తున్నట్లు బాధితులు తెలిపారు. తనకు, నా కుటుంబ సభ్యులకు దయాకర్‌ రెడ్డితో ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించి న్యాయం చేయాలని ప్రభాకర్‌ కోరారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు సేకరిస్తామని పోలీసులు తెలిపారు.

విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు

కరుణాకర్‌రెడ్డి

చేవెళ్ల: దేశంలో పేపర్‌ లీకేజీలు, పరీక్షలలో అవకతవకలు, పెరుగుతున్న ఫీజులు, నిరుద్యోగం తదితర సమస్యలపై కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ఛత్రోన్‌ కి గూంజ్‌ పేరుతో దేశవ్యాప్త విద్యార్థి ఉద్యమాన్ని ప్రారంభించారని విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కరుణాకర్‌రెడ్డి తెలిపారు. చేవెళ్లలో పలు కళాశాలల్లో శనివారం ఛత్రోన్‌ కి గూంజ్‌( విద్యార్థుల గొంతుక) కార్యక్రమంలో భాగంగా సిగ్నేచర్‌ క్యాంపెయిన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దేవర సమతారెడ్డి, కౌన్సిలర్‌ శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో విద్యావ్యవస్థలోని లోపాలను, యువత గొంతుకగా ప్రభుత్వానికి వినిపించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. దీనికి దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు సంతకాల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత సంతకాలు చేసి మద్దతు తెలుపుతున్నారన్నారు. సమస్యలు లోపాలు లేని విద్యావ్యవస్థ ఏర్పాటుతోనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సంతకాల సేకరణలో విద్యార్థులు పాల్గొని మద్దతు తెలపాలన్నారు. కార్యక్రమంలో కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

రైతుకు తృటిలో తప్పిన ప్రమాదం

శంకర్‌పల్లి: రోడ్డు పక్కన మేత మేస్తున్న ఎద్దు ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద విద్యుదాఘాతంతో మృతి చెందగా.. రైతుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన శనివారం మండల పరిధిలోని పర్వేద గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత రైతు అనంతయ్య తెలిపిన ప్రకారం.. ఉదయం కాడెడ్లను తాళ్లతో పట్టుకుని మేపుతూ పొలానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను తగిలిన ఓ ఎద్దు వెంటనే కిందపడిపోయింది. తాడు వదిలేయడంతో తనకు ప్రాణాపాయం తప్పిందన్నాడు. అధికారులు స్పందించి ఇప్పటికై నా ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని కోరాడు. తాను ఆర్థికంగా నష్టపోయానని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement