దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి

Jun 2 2026 7:40 AM | Updated on Jun 2 2026 7:40 AM

అనంతగిరి: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 110 దరఖాస్తులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటాచారి, ఉమాశంకర్‌ ప్రసాద్‌, జెడ్పీసీఈఓ సుధీర్‌, డీఆర్‌డీఏ శ్రీనివాస్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ రాంచంద్రయ్య

అనంతగిరి: వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ రాంచంద్రయ్య సోమవా రం బాధ్యతలు స్వీకరించారు.ఇక్కడ విధులు నిర్వహిస్తున్న రాజ్యలక్ష్మి బదిలీ అవ్వడంతో సీనియర్‌ సర్జన్‌ రాంచంద్రయ్యకు ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు.

అడిషనల్‌ సీడీపీఓ

శ్రీలక్ష్మి బదిలీ

నిజామాబాద్‌ అర్బన్‌ సీడీపీఓగా పోస్టింగ్‌

తాండూరు రూరల్‌: ఐసీడీఏస్‌ తాండూరు ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న అడిషనల్‌ సీడీపీఓ శ్రీలక్ష్మీ బదిలీ అయ్యారు. సాధారణ బదిలీల్లో భాగంగా సోమవారం ఆమెకు నిజామాబాద్‌ అర్బన్‌ సీడీపీఓగా పోస్టింగ్‌ కల్పించారు. జిల్లా పరిధిలో ఆమె ఏడున్నరేళ్లుగా తాండూరు అడిషనల్‌ సీడీపీఓగా, వికారాబాద్‌ బాలరక్షణ భవన్‌లో విధులు నిర్వర్తించారు. తాండూరు సూపర్‌వైజర్‌ నిర్మల కొడంగల్‌కు బదిలీపై వెళ్లారు. ఆఫీస్‌ సబార్డినేట్‌ సురేశ్‌ వికారాబాద్‌జిల్లాకు బదిలీఅయ్యారు.

విలీన తేదీని ప్రకటించాలి

ఎర్ర బ్యాడ్జీలు ధరించి

ఆర్టీసీ ఉద్యోగుల నిరసన

తాండూరు టౌన్‌: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని వెంటనే ప్రకటించాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం వారు ఎర్ర బ్యాడ్జీలు ధరించి డిపో గేట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించిన సర్కార్‌ ఇప్పటికే అపాయింటెడ్‌ డేట్‌ ప్రకటించకపోవడంతో ఉద్యోగులు, కార్మికులు తీవ్ర నిరాశ, నిస్పృహకు లోనవుతున్నారన్నారు. ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికలు నిర్వహించి, గెలిచిన యూనియన్‌ను కమిటీలో చేర్చిన తర్వాతే విలీన ప్రక్రియపై చర్చిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చెప్పడం సరికాదన్నారు. యూనియన్‌ ఎన్నికలతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

హెచ్‌పీఎస్‌కు ఇద్దరు విద్యార్థులు ఎంపిక

అనంతగిరి: హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌(హెచ్‌పీఎస్‌)లో 2026–27కు సంబంధించి 1వ తర గతి ప్రవేశాలకు జిల్లాలో ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ మేరకు సో మవారం కలెక్టరేట్‌లో లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేశారు. అడిషనల్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌ చేతుల మీదుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు చరణ్‌, తేజ స్విని అడ్మిషన్‌ పొందారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement