ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలి

Jun 2 2026 7:40 AM | Updated on Jun 2 2026 7:40 AM

● 21న ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం ● తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిడమర్తి రవి

తాండూరు టౌన్‌: ప్రత్యేక రాష్ట్ర కోసం పోరాడిన ఉద్యమకారులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిడమర్తి రవి డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన నియోజకవర్గ పరిధిలోని ఉద్యమకారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, గుర్తింపు కార్డు, గౌరవ వేతనం అందజేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌ కమిటీ వేసి ఉద్యమకారులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పిందని.. ఈ ప్రక్రియ వేగవంతం అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమంలో పాల్గొన్న సమయంలో గాయపడి ఆస్పత్రికి వెళ్లినా, కేసులు నమోదైనా, జైలుకు వెళ్లినా తదితర ఆధారాలను అందుబాటులో పెట్టుకోవాలన్నారు. గత ప్రభు త్వం అమరులైన ఉద్యమకారులకు కొంత మేరకు సహాయం చేసినప్పటికీ, గాయపడిన వారికి ఒక్క పైసా అందజేయలేదన్నారు. ఈనెల 21వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరాపార్కులో జరుగనున్న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఈడిగి సంజయ్‌ గౌడ్‌, ఉద్యమకారులు జిలాని, ప్రకాశ్‌గౌడ్‌, సుదర్శన్‌, శ్రీనివాస్‌, ఫిరోజ్‌ ఖాన్‌, కృష్ణ ముదిరాజ్‌, రామకృష్ణ, భద్రేశ్వర్‌, కేశవులు, ముజీబ్‌ ఖాన్‌, వీరమణి, హేమంత్‌, కాశీంపాషా, నాగేందర్‌ తదిరతులు పాల్గొన్నారు.

వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

పరిగి: ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పిడమర్తి రవి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన సంఘం సభ్యులతో కలిసి ఈ నెల 21 న నిర్వహించనున్న ఆత్మీయ స మ్మేళనం కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన ఇచ్చి న హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. నామినేటెడ్‌ పదవులల్లోనూ అవకాశాలను కల్పించాలన్నా రు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు ముకుంద నాగేశ్‌, వెంకట్‌రాములు, ఎర్రన్‌పల్లి శ్రీనివాస్‌, రమేష్‌బాబు, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement