రెండో విడతలో 2వేల ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

రెండో విడతలో 2వేల ఇళ్లు

Jun 2 2026 7:34 AM | Updated on Jun 2 2026 7:34 AM

తాండూరు: నియోజకవర్గానికి రెండో విడతలో 2వేల ఇళ్లు మంజూరవుతాయని ఎమ్మెల్యే మనోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన పెద్దేముల్‌ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయన్నారు. ఇప్పటి వరకు 800 ఇళ్లను పూర్తి చేశామన్నారు. మిగిలిన ఇళ్లు నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. రెండవ విడతలో మంజూరయ్యే ఇళ్లలో 1,500 ఇందిరమ్మ ఇళ్లు, రూఫ్‌ రిప్లేస్‌మెంట్‌ కోసం ఒక్కో ఇంటికి రూ.2లక్షల నిధులతో 500 ఇళ్లు మంజూరవుతున్నాయన్నారు.. ఇందిరమ్మ ఇళ్లు అంటే నాలుగు గోడలు కాదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం పేద కుటుంబాలకు భద్రత, గౌరవం, స్థిరమైన భవిష్యత్‌ అందించే సంక్షేమ కార్యక్రమమన్నారు. గత సర్కార్‌ హామీలకే పరిమితమైందని ఏ ఒక్క లబ్దిదారుడికి ఇళ్లను పంపిణి చేసిన దాఖలాలు లేవన్నారు. ఇందిరమ్మ ఇల్లు లేని ఊళ్లో తాను ఓటు అడగనని చెప్పానని ఇప్పటికి తాను కట్టుబడి ఉంటానన్నారు. ఈకార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్‌జాదవ్‌, ఏఎంసీ చైర్మన్లు పట్లోళ్ల నర్సింహులు, అంజయ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి నాయకులు తదితరులున్నారు.

తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement