దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

May 31 2026 11:58 AM | Updated on May 31 2026 11:58 AM

దరఖాస్తుల ఆహ్వానం వ్యవసాయ శాఖలో బదిలీలు ప్రజలతో మమేకమవ్వండి రంగారెడ్డి డీఎఫ్‌ఓకు జిల్లా అదనపు బాధ్యతలు సర్వేయర్ల పాత్ర కీలకం

తాండూరు టౌన్‌: మండలంలోని జినుగుర్తి గేట్‌ వద్ద గల మోడల్‌ స్కూల్‌ బాలికల హాస్టల్‌లో సహాయ వంట మనిషి పోస్టు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ ఇందుప్రియ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడో తరగతి విద్యార్హతతో, 18 నుంచి 45 ఏళ్ల లోపు వారు జూన్‌ 2వ తేదీ సాయంత్రం 5గంటల లోపు స్థానిక మండల వనరుల కేంద్రంలో దరఖాస్తు అందజేయాలన్నారు.

9మంది ఏఈఓలు, ఓ జూనియర్‌ అసిస్టెంట్‌, అటెండర్‌ బదిలీ

తాండూరు రూరల్‌: వ్యవసాయ శాఖ తాండూరు డివిజన్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు అధికారులు బదిలీ అయ్యారు. ఆయా మండలాల్లో పని చేస్తున్న 9మంది ఏఈఓలతో పాటు ఓ జూనియర్‌ అసిస్టెంట్‌, అటెండర్‌ శనివారం బదిలీపై ఇతర మండలాలకు వెళ్లారు. బెల్కటూర్‌ క్లస్టర్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఈఓ శ్రీనివాస్‌ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం కేతిరెడ్డిపల్లి క్లస్టర్‌కు, అంతారం ఏఈఓ శివకుమార్‌ రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం తాళ్లపల్లి క్లస్టర్‌కు, పెద్దేముల్‌ మండలం కందనెల్లి ఏఈఓ స్వాతి రంగారెడ్డి జిల్లా కందుకూరు ఏఈఓగా, తట్టెపల్లి ఏఈఓ శివరాజ్‌ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలానికి, గోపాల్‌పూర్‌ ఏఈఓ రజిత రంగారెడ్డి జిల్లా కేశంపేటకు బదిలీపై వెళ్లారు. బషీరాబాద్‌ మండలం కాశీంపూర్‌ ఏఈఓ విజయలక్ష్మి వికారాబాద్‌ మండలం బ్రాహ్మణపల్లికి, యాలాల మండలం రాస్నం ఏఈఓ శిరిష మన జిల్లా చౌడాపూర్‌కు, కొకట్‌ ఏఈఓ మదన్‌మోహన్‌ నవాబుపేట్‌ మండలానికి, జుంటుపల్లి ఏఈఓ మహేశ్‌ తలకొండపల్లిలోని చుక్కాపూర్‌ క్లస్టర్లకు బదిలీ అయ్యారు. తాండూరు కార్యాలయంలో పని చేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్‌ వంశీధర్‌రెడ్డి వికారాబాద్‌లోనిని జిల్లా కార్యాలయానికి, అటెండర్‌ ఇస్మాయిల్‌ పరిగికి బదిలీపై వెళ్లారు.

ఎస్పీ స్నేహ మెహ్ర

అనంతగిరి: ప్రజలతో మమేకమై పనిచేసినప్పుడే మంచి పేరు వస్తుందని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. డీఆర్‌ఆర్‌బీ కార్యాలయంలో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న నరేందర్‌రెడ్డి ఉద్యోగ విరమణ పొందారు. శనివారం వికారాబాద్‌లో ఆయన్ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 42 ఏళ్ల పాటు పనిచేయడం చాలా గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు జానయ్య, శ్రీనివాస్‌, జిల్లా పోలీస్‌ ప్రెసిడెంట్‌ అశోక్‌, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అనంతగిరి: రంగారెడ్డి డీఎఫ్‌ఓగా విధులు నిర్వహిస్తున్న రోహిత్‌ గోపిడికి వికారాబాద్‌ జిల్లా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న జ్ఞానేశ్వర్‌ ఇటీవలే బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్‌ గోపిడికి అదనపు బాధ్యతలు ఇచ్చారు.

అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటాచారి

అనంతగిరి: భూ సమస్యల పరిష్కారంలో సర్వేయర్ల పాత్ర కీలకమని అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటాచారి అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శిక్షణ పొందిన సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా గ్రామాల్లో భూముల కొలతలు తీయాలన్నారు. జిల్లాలో 150 మంది శిక్షణ పొందిన సర్వేయర్లను నియమించడం జరిగిందన్నారు. మొదటి విడతలో 69 మందిని, రెండో విడతలో 81 మంది ఆయా ప్రాంతాలకు కేటాయించడం జరిగిందన్నారు. వికారాబాద్‌ మండలానికి 13 మంది, ధారూర్‌కు 8మంది, కోట్‌పల్లి, బంట్వారానికి నలుగురు చొప్పన, మర్పల్లి, మోమిన్‌పేట, నవాబుపేట, పూడూరుకు ఎనిమిది మంది చొప్పున, పరిగికి 14 మందిని, దోమకు 6, కుల్కచర్లకు 7, చౌడాపూర్‌కు 5, తాండూరు, పెద్దేముల్‌కు 9 మంది చొప్పన, బషీరాబాద్‌, యాలాల, దౌల్తాబాద్‌, బొంరాస్‌పేటకు ఆరుగురు చొప్పన, కొడంగల్‌కు 10మందిని, దుద్యాల్‌కు 5 మంది సర్వేయర్లను కేటాయించినట్లు తెలిపారు. సమావేశంలో సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ మధుసూదన్‌, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement