అనంతగిరి: సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి అన్నారు. ప్రజాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిషన్ వాత్సల్య పథకం, జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖల ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణవేణి మాట్లాడుతూ.. సైబర్ నేరాలు 80 శాతం మొబైల్ ఫోన్ల వల్లే జరుగుతున్నాయన్నారు. విద్యార్థులు అవగాహన పెంచుకుని మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. బహుమతులు పేరిట వచ్చే ఫోన్ కాల్స్‌కు స్పందిచవద్దని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలకు ఆకర్శితులై లింకులు ఓపెన్ చేయొద్దని చెప్పారు.
1930 నంబర్‌కు కాల్ చేయాలి
అనంతరం డీఎస్పీలు జాన్యయ్య, శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులకు సైబర్‌నేరాలపై పూర్తిగా అవగాహన ఉండాలన్నారు. బ్యాంకింగ్ మోసాలు, ఓటీపీ అడుగుతున్న ఫోన్ కాల్స్, సామాజిక మాధ్యమాల మోసాలపై అప్రమత్తత అవసరమన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రై వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఓటీపీ, ఓఎల్‌ఎక్స్, పేటీఎం, గూగూల్ పే, ఫోన్ పే, కేవైసీ అప్ డేట్ మెసేజ్‌లకు స్పందించొద్దన్నారు. అనంతరం నశాముక్త్ భారత్ వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఐఓ వరలక్ష్మి, ఎకై ్సజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాఘవీణ, కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్, లీడ్ బ్యాంక్ ఇండియా మేనేజర్ యాదగిరి, డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీకాంత్, డీసీపీయూ కౌన్సిలర్ లక్ష్మణ్, సోషల్ వర్కర్ వనమాల, మహిళా సాధికారత సిబ్బంది వరలక్ష్మి, బాబు చైల్డ్ లైన్ సూపర్ వైజర్ ఆనంద్, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి


