యాలాల: పెట్రోల్, డీజిల్ పక్కదారి పట్టకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ దీపక్ తివారీ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ మండలంలో తహసీల్దార్ కార్యాలయం, పీహెచ్‌సీ, ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయంలో సివిల్ సప్లయ్ అధికారులు జిల్లాలోని అన్ని బంకులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి కృత్రిమ కొరత లేకుంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. యాప్ ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. కొత్తగా నిర్మిస్తున్న పంచాయతీ కార్యాలయ భవనాలను వేసవిలోనే పూర్తి చేసేందుకు అధికారులు దృష్టిసారించాలన్నారు. స్థానిక పీహెచ్‌సీ సందర్శించి ఓపీ రిజిస్టర్లు, మందుల వివరాలను సిబ్బందిని అఢిగి తెలుసుకున్నారు. యాలాల మండల కేంద్రంలో ఇటీవల పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీఏఓ రాజారత్నం, డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి, తహసీల్దార్ వెంకటస్వామి, డీటీ కిరణ్‌కుమార్, ఎంపీడీఓ శ్రీనిజ, ఎంఈఓ మహిపాల్‌రెడ్డి, ఏఓ శ్వేతరాణి, వైద్యాధికారి రూబియానాజ్, యాలాల సర్పంచ్ శివయ్య, కోఆప్షన్ మాజీ సభ్యుడు అక్బర్‌బాబా తదితరులు ఉన్నారు.


