45 రోజుల తర్వాత ఇంటికి | - | Sakshi
Sakshi News home page

45 రోజుల తర్వాత ఇంటికి

Apr 30 2026 9:30 AM | Updated on Apr 30 2026 9:30 AM

45 రోజుల తర్వాత ఇంటికి

పైలెట్‌ యోగక్షేమాలు తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు

తాండూరు: తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి 45 రోజుల తర్వాత బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. అజీజ్‌నగర్‌ ఫామ్‌ హౌస్‌ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఆయన సోదరుడు రితీష్‌రెడ్డి, స్నేహితుడు అమిత్‌శర్మలను అరెస్టు చేసి మార్చి 15వ తేదీన చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. ఈ క్రమంలో మంగళవారం రోహిత్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైంది. దీంతో బుధవారం మధ్యాహ్నం ఆయన జైలు నుంచి విడుదల కావడంతో బీఆర్‌ఎస్‌ తాండూరు నియోజకవర్గ నాయకులు మణికొండలోని పైలెట్‌ నివాసానికి చేరుకొన్నారు. సాయంత్రం ఆయన్ను కలిసి యోగాక్షేమాలు తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement