● చెంచుపల్లిలో పర్యటించిన అధికారులు
● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆటకంగా ఉన్న వైర్ల పరిశీలన
పూడూరు: విద్యుత్ తీగలు అడ్డుగా ఉండటంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయని పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆశాఖ అధికారులు స్పందించారు. మంగళవారం మండల పరిధిలోని చెంచుపల్లిని సందర్శించి, సర్పంచ్ దయాకర్‌తో కలిని పరిస్థితిని పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లపై ఉన్న వైర్లను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకుంటామని ఎస్‌సీ రవి, ఏడీ నాయుడు ప్రసాద్ హామీ ఇచ్చారు. వారం రోజుల్లో సమస్యను పరిష్కారించాలని ఏఈ రాజును ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈఈ ముక్రం, ఏఈ ఉదయ్ తదితరులు ఉన్నారు.


