● ఇద్దరి మృతి, పలువురికి గాయాలు
● వెల్జాల సమీపంలో ప్రమాదం
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం వెల్జాల సమీపంలో మంగళవారం సాయంత్రం రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. తలకొండపల్లి ఎస్‌హెచ్‌ఓ జానకిరాంరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. అంతారానికి చెందిన పలువురు తలకొండపల్లి నుంచి కారులో వెల్జాలకు వెళ్తుండగా గ్రామ సమీపంలో ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇరు వాహనాల్లో ప్రయాణిస్తున్న శారదమ్మ, పెద్ద శ్రీను, శ్రీనుగౌడ్, పెద్దమ్మ, రిషి, మురళీధర్ శాస్త్రి, దత్తు గాయపడటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. వీరిలో శారదమ్మ(52), పెద్ద శ్రీను(45) మార్గమద్యంలో మృతిచెందారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.


