యాలాల: కిరాణ కొట్టులో చోరీ జరిగిన ఘటన మండల పరిధిలోని మార్కండేయ కాలనీలో మంగళవారం వెలుగుచూసింది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మాకాలి శ్రీనాథ్ కిరాణ కొట్టు వ్యాపారి. పొరుగింట్లో ఫంక్షన్ ఉండటంతో సోమవారం షాపును కట్టేసి త్వరగా ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం తెరిచేందుకు వెళ్లగా, షట్టర్ తాళాలు విరిగి ఉండటాన్ని గమనించాడు. అనంతర షాపులో గమనించగా, గల్లాపెట్టెలో ఉంచిన రూ.30వేల నగదు కనిపించలేదు. నగదు మాత్రమే ఎత్తుకెళ్లిన దొంగ, ఇతర సామాన్లను ముట్టలేదు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
శతాధిక వృద్ధురాలి కన్నుమూత
దౌల్తాబాద్: మండల కేంద్రానికి చెందిన శతాధిక వృద్ధురాలు కనక మ్మ (102) మంగళవా రం తెల్లవారుజామున కన్నుమూశారు. కొడుకులు, కూతుళ్లు, మనవ లు, మనవరాళ్లతో పాటు ముని మనవలు, ముని మనవరాళ్లను ఎత్తుకుని ఆడించిన అవ్వకు పలు వురు నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
బస్సు ప్రమాదంలో
మహిళకు గాయాలు
అనంతగిరి: ఎమ్మార్పీ చౌరస్తాలో బస్సు ఎక్కుతున్న ఓ మహిళ ప్రమాదానికి గురైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. బార్వాద్ గ్రామానికి చెందిన తాండ్ర బాలమ్మ సొంతూరుకు వెళ్లేందుకు తొర్‌మామిడి బస్సు ఎక్కుతోంది. ఇది గమనించని డ్రైవర్ బస్సును ముందుకు తోలడంతో కింద పడిపోయిన ఆమె కాలి పైనుంచి వెనక చక్రాలు వెళ్లాయి. ప్రమాదంలో బాలమ్మ కాలు విరిగి, గాయాలయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కేపీహెచ్‌బీకాలనీ: కూకట్‌పల్లి జాతీయ రహదారిపై మంగళవారం వాటర్ ట్యాంకర్ ఢీకొని ఓ ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేపీహెచ్‌బీ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... బీహార్‌కు చెందిన అభినవ్ కుమార్ మిశ్రా(25) గాయత్రినగర్‌లో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అతడు ఓ ఫార్మసీ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్. మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై మియాపూర్ నుంచి కేపీహెచ్‌బీ వైపు వస్తుండగా నిజాంపేట క్రాస్‌రోడ్డు వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. తల ఛిద్రమై తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ సీఐ జాన య్య ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని తొలగించి ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించారు.


