● భరోసా సెంటర్ కౌన్సిలర్లు
రాజశ్రీ, పూజిత
● డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు
అవగాహన
కొడంగల్ రూరల్: మహిళా చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని భరోసా సెంటర్ కౌన్సిలర్లు రాజశ్రీ, పూజిత, కొడంగల్ ఎస్‌ఐ జివి.సత్యనారాయణ సూచించారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సైబర్ మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. బాలల హక్కుల పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే 100, 109, 112 నంబర్లకు సమాచారం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్స్‌పాల్ రఫియాఖానమ్, సిబ్బంది టి.రాంబాబు, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సోమ్లా, హరిప్రియ, విద్యార్థులు పాల్గొన్నారు.


