2న ఆలయ భూములకు కౌలు వేలం | - | Sakshi
Sakshi News home page

2న ఆలయ భూములకు కౌలు వేలం

Apr 29 2026 8:30 AM | Updated on Apr 29 2026 8:30 AM

2న ఆలయ భూములకు కౌలు వేలం తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ వికారాబాద్‌ డీఎస్పీగా అంజయ్య అంబులెన్స్‌లలోఉద్యోగ అవకాశాలు షాద్‌నగర్‌: 108, 102 అంబులెన్స్‌లలో ఈఎంటీ, డ్రైవర్‌ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జీవీకే ఈఎంఆర్‌ఐ జిల్లా మేనేజర్‌ జాన్‌షాహీద్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 108 అంబులెన్స్‌లో ఈఎంటీ (మెడికల్‌ టెక్నీషియన్‌ ) కోసం బీఎస్సీ లైఫ్‌ సైన్సెస్‌, జీఎన్‌ఎం డిప్లొమా ఇన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాసై ఉండాలని తెలిపారు. 102 అంబులెన్స్‌ డ్రైవర్స్‌ కోసం పదో తరగతి పాసై ఉండాలని, హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులకు ఈనెల 30న షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎంపికై న వారు రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో పని చేయాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాల కోసం 91007 99167 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

అనంతగిరి: అనంత పద్మనాభస్వామి ఆలయ భూములను కౌలుకు ఇచ్చేందుకు గాను మే 2న వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త ఎన్‌ పద్మనాభం, ఈఓ టీ నరేందర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో వేలం ఉంటుందని తెలిపారు. వేలం హక్కులు పొందిన వారు మూడేళ్ల పాటు(మే 05 నుంచి ఏప్రిల్‌ 30 2029 వరకు) వ్యవసాయం చేసుకోవచ్చని తెలిపారు. వికారాబాద్‌ మండలం గుడుపల్లి సర్వే నంబర్‌ 65లో 328 ఎకరాలు, కొత్తగడి గ్రామ సర్వే నంబర్‌ 175లో 219 ఎకరాలు, మరో సర్వే నంబర్‌ 176లో 324 ఎకరాలు, పులుసుమామిడి గ్రామ సర్వే నంబర్‌ 180లో 228 ఎకరాలు, మరో సర్వే నంబర్‌ 181లో 110 ఎకరాలు, నారాయణపూర్‌ సర్వే నంబర్‌ 135లో 1,334 ఎకరాలు, పరిగి మండలం బిజ్వారం గ్రామ సర్వే నంబర్‌ 169/ఆలో 206 ఎకరాలు, తాండూరు మండలం అంతారం గ్రామ సర్వే నంబర్‌ 205లో 25ఎకరాలు, మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండ మండలం కేశ్వాపూర్‌ గ్రామ సర్వే నంబర్‌ 105లో 803 ఎకరాల భూములు ఉన్నట్లు తెలిపారు. వీటికి కౌలు హక్కు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల రైతులు రూ.2 వేలు డిపాజిట్‌ చేసి వేలంలో పాల్గొన వచ్చని వారు తెలిపారు.

కొడంగల్‌ రూరల్‌: తెలంగాణ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉద్యానశాఖ రాజేంద్రనగర్‌లో తేనెటీగల పెంపకంపై ఏడు రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ శాఖ హెచ్‌ఈఓ బాబ్యానాయక్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపిక చేసిన 25 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ, భోజనం, వసతి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్‌ అందజేస్తారని పేర్కొన్నారు. తేనెటీగల పెంపకం ప్రాంభించాలనుకునే వారికి ప్రభుత్వం నుంచి ప్సోత్సాహం లభిస్తుందని తెలిపారు. ఇంటర్‌, డిగ్రీ, ఆపై ఉన్నత చదువులు చదివిన వారు ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు సెల్‌ నంబర్‌ 99487 26997లో సంప్రదించాలని తెలిపారు.

పార్కు పనులను వెంటనే పూర్తి చేయండి

అనంతగిరి: వికారాబాద్‌ పట్టణ పరిధిలో హెచ్‌ఎండీఏ కింద చేపట్టిన పార్కుల ఆధునీకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గడ్డం అనన్య తెలిపారు. మంగళవారం పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ విక్రం సింహారెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఏసుదాసు, ఎన్విరాల్‌మెంట్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌, మెప్మా ఇంచార్జి వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

అనంతగిరి: వికారాబాద్‌ డీఎస్పీగా అంజయ్య నియమితులయ్యారు. ఇదివరకు ఇక్కడ విధులు నిర్వహించిన శ్రీనివాస్‌రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో అంజయ్యను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు కృషి చేస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement