ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
తాండూరు: పొట్లి మహరాజ్ ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అఽధికారులను ఆదేశించారు. సోమవారం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజాబాల్‌రెడ్డితో కలిసి సందర్శించారు. ఆలయ పనులు అసంపూర్తిగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. శివాలయ జీర్ణోద్ధారణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. మరోవైపు ఆలయ కమిటీ పదవీ కాలం నాలుగు రోజుల క్రితం ముగియడంతో మరో 6 నెలల పాటు పొడగించేలా ప్రతిపాదనలు పంపించడం జరిగిందని తెలిపారు.
ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం
పట్టణ శివారులోని రసూల్‌పుర ఆంజనేయ స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి హాజరయ్యారు. ఆలయ కమిటీ చైర్మన్‌గా రాధాకిషన్‌బూప్, ధర్మకర్తలుగా మహేశ్ సార్డ, దినేష్‌పర్తాని, మొగులంపల్లి నర్సింహులు, డప్పు పద్మమ్మలు పదవి ప్రమాణ స్వీకారం చేశారు.


