శాంతి సేవలకు హిందూ ధర్మం ప్రతీక | - | Sakshi
Sakshi News home page

శాంతి సేవలకు హిందూ ధర్మం ప్రతీక

Apr 28 2026 8:46 AM | Updated on Apr 28 2026 8:46 AM

తెలంగాణ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శంకర్‌ స్వామీజీ

దౌల్తాబాద్‌: సనాతన ధర్మం, శాంతి సేవలకు హిందు ధర్మం ప్రతీకగా నిలుస్తుందని తెలంగాణ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శంకర్‌ స్వామీజీ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో హిందు సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో హిందు సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సంస్కృతి, పరిరక్షణకు హిందు సమాజం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హిందు ధర్మం గొప్పతనం, సంస్కృతి పరిరక్షణ, సామాజిక ఐక్యతపై సందేశం ఇచ్చారు. యువతలో ధార్మిక చైతన్యం పెంపొందించాలన్నారు. కలియుగంలో సనాతన ధర్మమే రక్షిస్తుందని, మునులు, ఋషులు ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. కుటుంబ వ్యవస్థ బాగుపడినప్పుడే మన సామాజిక స్థితి బాగుపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో వక్తలు కేరేల్లి అనంత్‌రెడ్డి, శ్రీలతరెడ్డి, బాబుసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement