ఇంధనం కోసం ఆరాటపడుతున్న వాహనదారులు
పరిగి/ దుద్యాల్: పశ్చిమ దేశాల్లో కొనసాగుతున్న యుద్ధమో.. మరేదైనా కారణమో స్పష్టత లేకపోయినా.. రాష్ట్రంలో చమురు ఇక్కట్లు నెలకొన్నా యి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదని ప్రభు త్వం స్పష్టం చేస్తున్నా.. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న అసత్య ప్రచారాలతోఇంధనం కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. పొరుగు రాష్ట్రం ఏపీలో నిల్వలు అడుగంటాయన్న సమాచారంతో తెలంగాణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు ఆరాట పడుతున్నారు. బంకులకు క్యూ కడుతున్నారు. తమ వాహనాలతో పాటు.. క్యాన్లతో బారులు తీరారు. ఇలా ఒక్కసారి డిమాండ్ పెరగడంతో బంకుల నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. నో స్టాక్ అంటూ క్రమంగా మూసివేస్తున్నారు. సోమవారం దుద్యాల్ నుంచి కోస్గి వెళ్లే మార్గంలో నో స్టాక్ బోర్డుతో బంక్ వెలవెలబోయింది. పరిగి పరిసరాల ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద కిలో మీటరు మేర ప్రజలు వరుస కట్టారు.


