ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయిస్తాం | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయిస్తాం

Apr 28 2026 8:46 AM | Updated on Apr 28 2026 8:46 AM

అడ్డుగా ఉన్న విద్యుత్‌ తీగలను

తొలగింప చేస్తాం

హసింగ్‌ డీఈఈ సయ్యద్‌సాజిద్‌

పూడూరు: ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయిస్తామని హౌసింగ్‌ డీఈఈ సయ్యద్‌ సాజిత్‌ లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. సోమవారం మండల పరిధి చెంచుపల్లి, ఎన్కేపల్లి గ్రామాల్లో అసంపూర్తిగా నిలిచిన ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించి మాట్లాడారు. మండల పరిఽధిలోని ఆదర్శ గ్రామంగా ఎంపికై న ఎన్కేపల్లి, చెంచుపల్లిలో 241 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటి వరకు 109 నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో 107 నివాసాలు వివిధ స్థాయి దశలో ఉన్నాయని పేర్కొన్నారు. 25 వరకు ఇళ్లు నాట్‌ స్టార్‌టెడ్‌ జాబితాలో ఉన్నాయన్నారు.

ఇంటిని కూల్చి, గుడిసెలో నివాసం

జాబితాలో పేరు వచ్చిన వారు తమ ఇళ్లను నేల మట్టం చేసుకున్నారు. తీరా ఆధార్‌ మ్యాపింగ్‌ కాలేదని జుబ్బురు పుష్షమ్మ ఇంటికి మార్కింగ్‌ ఇవ్వలేదు. దీంతో ఆమె ఉన్న ఇంటిని కూల్చి, గుడిసెలో ఉంటోంది. చెంచుపల్లిలో విద్యుత్‌ తీగలు అడ్డు వచ్చి నిర్మాణాలు అసంపూర్తిగా ఆగాయి. వీటి పరిశీలించిన హౌసింగ్‌ అధికారులు.. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. అడ్డుగా ఉన్న విద్యుత్‌ వైర్ల గురించి ఏఈతో మాట్లాడగా.. రెండు రోజుల్లో ఆ తీగలను తొలగిస్తామని తెలిపారు. నాట్‌ స్టార్‌టెడ్‌ జాబితా లో ఉన్న వారికి మరోసారి అవకాశం కల్పించాలని, ఇళ్లు లేని వారికి కొత్తగా మంజూరు చేయాలని సర్పంచ్‌ దయాకర్‌ అధికారులను కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పాండు, హౌసింగ్‌ అధికారి చందర్‌నాయక్‌, ఉప సర్పంచ్‌ విజయ్‌కుమార్‌, పంచాయతీ కార్యదర్శి చంద్రకళ, వార్డు సభ్యులునరేష్‌, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement