అనంతగిరి: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య డిమాండ్ చేశారు. సోమవారం వికారాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి పోరుబాట కార్యక్రమం వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ దీపక్ తివారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రూ.8 వేల కోట్ల బోధనా రుసుం చెల్లించపోవడంతో విద్యార్థు లు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో ముఖ్యమంత్రి ఇంటి ని ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్, మండల అధ్యక్షుడు మైపాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు సురేష్, అనంత్‌రెడ్డి, సుభాన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకులు శాంతికుమార్, దత్తాత్రేయరావు, జుబేర్, అక్రం, పర్వేజ్, అరుణ్, ఇబ్రహీం, వినోద్ తదితరులు పాల్గొన్నారు.


